వాగులో కొట్టుకుపోతున్న… మూగజీవాలను కాపాడిన పోలీసులు

by  |
వాగులో కొట్టుకుపోతున్న… మూగజీవాలను కాపాడిన పోలీసులు
X

దిశ, వర్ధన్నపేట: వరదలో కొట్టుకుపోతున్న మూగజీవాలను రక్షించి, పోలీసుల్లో కఠినత్వమే కాకుండా, మానవత్వం కూడా ఉంటుందని ఓ పోలీసు అధికారి నిరూపించారు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… వర్ధన్నపేట పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారి సంగెపు వాగు బ్రిడ్జి దెబ్బతిన్నది.

గురువారం మరమ్మతులు చేస్తున్న పోలీసు సిబ్బంది, వాగులో బర్రెతో పాటు దూడ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని గమనించారు. అక్కడే ఉన్న వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్ స్వయంగా బ్రిడ్జి పైనుంచి తాడువేసుకొని నీటిలో దిగారు. ఎస్సై వంశీకృష్ణ సైతం ఆ మూగజీవులను కాపాడడానికి మరో తాడుతో సహాయపడ్డారు. అందుబాటులో స్థానికులు ఎవరూ లేకపోవడంతో ఎస్సై, సీఐ గన్ మెన్లు సోమిరెడ్డి, బర్రె, దూడను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.


Next Story