ముగ్గురు రౌడీషీటర్ల పై పీడీ యాక్టు

by Shyam |
ముగ్గురు రౌడీషీటర్ల పై పీడీ యాక్టు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో ముగ్గురు రౌడీ షీటర్లపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు నార్త్ రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ముగ్గురు రౌడీ షీటర్లు ఆరిఫ్, ఉస్మాన్ , ఇబ్రహీం చావుస్‌లపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశానుసారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సంవత్సర కాలం నుండి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 వ , ఒకటవ , ఆరవ టౌన్ పరిధిలో ముగ్గురిపై 2 హత్యాయత్నం కేసులతో పాటు పలు కేసుల్లో రిమాండ్ అయ్యారని తెలిపారు. కాగా వీరిపై నెల రోజుల క్రితం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని తెలిపారు. పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో సివిల్ తగాదలలో వారు ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. దీంతో నేరచరిత్ర ఆధారంగా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story