పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ప్రజాప్రతినిధులు

దిశ వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో ప్రజాప్రతినిధులు అడ్డంగా దొరికిపోయారు. పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు.. టాస్క్‌ఫోర్స్ బృందాలు పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్వ శ్రీరాంపూర్‌ వైస్ ఎంపీపీ ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు నేరుగా అతడి ఇంట్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 11 మంది జూదరులను అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ. 1,41,660 నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement