- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిరిసిల్లలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
by Anukaran |

X
ధిశ, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. ప్రేమ్ నగర్ దాడి అనంతరం సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు తంగాళ్లపల్లి మండల కేంద్రంలోని వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి ఆధార్, జనన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ వృత్తిని మానేసి, జీవనోపాధి చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు స్పష్టం చేశారు.
ఓ బాధితురాలు ఆరేళ్లుగా ఈ వ్యభిచార కూపిలో చిక్కుకున్న విషయం మంగళవారం వెలుగులోకి రాగా అమెను బంధువులకు అప్పగించారు. ఇకనుంచి వ్యభిచార గృహాల నిర్వహకులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు.
Next Story