వేములవాడ గుడిలో పోలీసుల ఓవర్ యాక్షన్

by Anukaran |
వేములవాడ గుడిలో పోలీసుల ఓవర్ యాక్షన్
X

దిశ, వేములవాడ: వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం సామాన్యులకు కష్టతరంగా మారింది. రాజకీయ నాయకులు, వీఐపీలు, పోలీసులకు, పలుకుబడి గల వారికే రాజన్న దర్శనమిస్తుండగా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నా దర్శనం అందడం లేదు. మరో వైపు పోలీసుల జులుం ఎక్కువైందని భక్తులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా ఆలయంలో సేవలు చేస్తున్న కోనారావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌పై గురువారం విధులు నిర్వహిస్తున్న సీఐ కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారు. అకారణంగా తనపై చేయి చేసుకున్నారని, సీఐను విధుల నుంచి తొలగించాలని ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలకు ఫిర్యాదు చేశారు. దర్శనం కోసం చంటి పిల్లవాడితో రెండు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించామని, పాల కోసం పసిపిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నా తమను పోలీసులు బయటకు వదలలేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై కాళ్ల మీద పడ్డా కనికరించ లేదని బాధితులు వాపోయారు. జాతరను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టుల‌పై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఎండో‌మెంట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపానపోలేదు. శివరాత్రి జాతర మాత్రం పోలీసుల జాతరగా మారిందని భక్తులు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed