బయటకి వచ్చారు.. బలి అయ్యారు

by Aamani |
బయటకి వచ్చారు.. బలి అయ్యారు
X

దిశ, బోథ్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనానకట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించింది. ఈ నేపథ్యలో ఈనెల 30 వరకు విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు తెలంగాణ పోలీసు అధికారులు. ప్రజలు ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా ఉన్నా వారికి ఫైన్ విధించాలన్నారు. ఉదయం 10 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు.

ప్రతిరోజు లాక్‌డౌన్‌ మినహాయింపు గడువు ముగియగానే పెట్రోలింగ్‌ వాహనాలు సైరన్‌ వేసి సంచరించాలని ఆదేశాలిచ్చారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిచినవారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజలకు చీమ కట్టినట్టు కూడా లేదని రోడ్ల మీదకు వస్తూ తిరిగేసరికి పోలీసులు వాళ్ల ప్రతాపం చూపించారు. భోథ్ మండల కేంద్రంలోని అనవసరంగా వచ్చిన దాదాపు 100 వాహనాలను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలానే పత్రాలు లేని వారి వాహనాలను సీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed