- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థిని బూటు కాలుతో తన్నిన పోలీసు.. వీడియో వైరల్
దిశ, వరంగల్ ప్రతినిధి : పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, పరీక్షల వేళ విద్యాసంస్థలు మూసివేస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని కోరుతూ హన్మకొండ నయీమ్ నగర్‌లో ఏబీవీపీ విద్యార్థులు ధర్నా దిగారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. నిరసనకారులను వాహనాల్లో ఎక్కించే క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య పెనుగులాట జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఓ పోలీసు అధికారి విద్యార్థిని బూటు కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు వీడియాలో రికార్డు అయ్యాయి. నిరసనకారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.