- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో కిడ్నాప్‌నకు గురైన రెండేళ్ల చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 9న మాసబ్‌ట్యాంక్ మహావీర్ ఆస్పత్రి సమీపంలో రాత్రి 12గంటలకు ఫుట్‌పాత్‌పై తన రెండేళ్ల కూతురుతో కలిసి తల్లి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు చిన్నారి మహిన్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించగా తల్లి గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. అనంతరం మళ్లీ 1.30గంటలకు ఆటోలో వచ్చిన కొందరు.. చిన్నారిని ఎత్తుకెళ్లారు. ఎంత ప్రయత్నించినా ఆటో దొరక్కపోవడంతో నార్సింగిలోని తన ఇంటికి వెళ్లి భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మహ్మద్ అబ్దుల్ ఫిర్దోష్, సయ్యద్ షరీఫ్‌లను కిషన్‌బాగ్‌లో అదుుపులోకి తీసుకొని విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. అనంతరం చిన్నారిని పోలీసులకు ఇవ్వడంతో వారు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులకు సహకరించిన సమీనా అలియాస్ లక్ష్మీ, రిజ్వానా అలియాస్ పద్మలు పరారీలో ఉన్నట్టు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. భర్త వికలాంగుడు కావడంతో మహిళ మాసబ్‌ట్యాంక్ పరిసరాల్లో బెగ్గింగ్ చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నట్లు తెలుస్తోంది.