- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పక్కా సమాచారంతో పోలీసుల దాడులు.. భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
by Sumithra |

X
దిశ, ఇబ్రహీంపట్నం: మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తోన్న నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటేశంగౌడ్ వివరాల ప్రకారం.. గుట్టుచప్పుడు కాకుండా పోల వీరేష్, రాచమల్ల శ్రీహరి అనే ఇద్దరు వ్యక్తులు మంచాల గ్రామంలోని శ్రీహరి కిరాణా షాపులో నిషేధిత తంబాకు ప్యాకెట్లను విక్రయిస్తున్నారని వచ్చిన పక్కా సమాచారంతో ఎస్ఐ రామన్ గౌడ్ కానిస్టేబుళ్లతో కలిసి దాడులు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 25 వేలు విలువ చేసే నిషేదిత గుట్కా ప్యాకెట్లతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, నోటీస్ ఇచ్చామని తెలిపారు.
Next Story