ఎదురుకాల్పులు కాల్పులు.. తప్పించుకున్న మావోలు

by Sridhar Babu |   ( Updated:2020-08-04 09:04:57.0  )
ఎదురుకాల్పులు కాల్పులు.. తప్పించుకున్న మావోలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పొటాలి, మిర్చి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా, బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన జరిగింది. దంతెవాడలోని జిల్లా అరన్‌పూర్ పరిధిలోని పొటాలి-మిర్చిపారా ఏరియాలో జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అనంతరంగా మావోయిస్టల డెన్ లో గాలింపు చేపట్టగా పవర్ కార్డ్, బ్యానర్లు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దర్భా డివిజన్ ప్లాటూన్ నంబర్ 24 కమాండర్ జయలాల్, సోమంగిర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోమడుతో పాటు 15 నుంచి 20 మంది మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అలాగే రెండు చోట్ల మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుగుండును నిర్వీర్యం చేసిన బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed