సరిహద్దుల్లో హై అలెర్ట్..

by Anukaran |   ( Updated:2020-07-24 06:58:06.0  )
సరిహద్దుల్లో హై అలెర్ట్..
X

దిశ, కాటారం:

మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పోలీసుల హై అలెర్ట్ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో గోదావరి పరివాహక జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరం కావడం, పలు చోట్ల ఎదరు కాల్పుల సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పల్మెల మండలాల్లో పోలీసులు ఓ వైపున గాలింపు చర్యలు చేపడుతూనే అంతరాష్ట్ర వంతెన వద్ద బందోబస్తు మరింత పటిష్టం చేశారు. మహదేవపూర్, పల్మెల మండలాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో నిఘాను మరింత పెంచారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వారిని అదుపులోకి తీసుకుని విచారించాలని కూడా నిర్ణయించారు. దీంతో గోదావరి తీరం అంతా కూడా ఖాకీలమయం అయిపోయింది.

Advertisement

Next Story