విశాఖ మన్యంలో మావోల అలజడి

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. మంగళవారం మావోల కదలికల పై అనుమానం వచ్చిన అధికారులు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూమిలో అమర్చిన మందుపాతరలను వెలికి తీశారు. జీకే వీధి మండలం పెదపాడు, కుంకుంపూడి ఏరియాల్లో మందు పాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా రెండు మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. ల్యాండ్‌మైన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement