- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజ్‌న్యూస్ రిపోర్టర్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ‘జర్నలిస్ట్ రఘు కిడ్నాప్’ అయ్యాడన్న వార్తలకు పోలీసులు చెక్ పెట్టారు. గతంలో రాజ్‌న్యూస్ రిపోర్టర్‌గా గుర్రంపోడు గిరిజన భూముల్లో అధికార పార్టీ నేతల ఆక్రమణ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టగా.. రఘు న్యూస్ కవరేజ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో పాటు రఘుపైన కూడా ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈకేసులో రఘు A-19గా ఉన్నాడు. ఈ విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో మల్కాజ్‌గిరిలోని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నామని మట్టపల్లి పోలీసులు రఘు భార్యకు నోటీసులు ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు పంపుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు. రఘు గుర్రంపోడు వ్యవహారం జరిగినప్పడు రాజ్ న్యూస్ రిపోర్టర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. ప్రస్తుతం తొలి వెలుగు, యూ ట్యూబ్ చానల్‌లో యాంకర్‌గా కొనసాగుతున్నాడు.