- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS జెండానా మజాకా.. డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల ఓవరాక్షన్.. పరుగు తీసిన జనం
దిశ, పరిగి : అధికార పార్టీ జెండాను ఎత్తుకెళ్లారంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడం, ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి డాగ్ స్క్వాడ్‌తో వెతికించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చారానా కోడికి బారానా మసాలా.. అనే సమెతను నిజం చేస్తున్నారని పరిగి మండల ప్రజలు అనుకున్నారు. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో గుర్తుతెలియని వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ జెండా రాడ్, జెండాను ఎత్తుకెళ్లారు.
మా పార్టీ జెండానే ఎత్తుకెళ్తారా అంటూ టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన పోలీసులు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి ఊరంతా గాలింపు చేపట్టారు. ఇది తెలియని గ్రామస్తులు ఊర్లో ఏదైనా ఘరానా దొంగ తనం లేదా మర్డర్ జరిగిందా అని భయంతో వారి వెంట పరుగులు తీశారు. తీరా విషయం తెలుసుకున్నాక నోరెళ్ల బెట్టారు. పోలీసుల ఓవరాక్షన్‌లో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.
కేవలం రూ.50, రూ.100ల జెండా, రాడ్ కోసం వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి పోలీసుల జీపు, జాగిలం, పోలీసు సిబ్బంది, పరిగి సిబ్బంది డబ్బు, సమయం వృథా తప్ప ఒరిగిందేమీ లేదంటూ ప్రజలు నవ్వుకున్నారు. జాగిలం ఊరంతా తిరిగి ఏమీ కనిపెట్టలేక పోవడం గమనార్హం.