- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొబ్బరి మాటున గుట్కా రవాణా
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కొబ్బరికాయల రవాణా పేరిట అక్రమంగా గుట్కా తరలిస్తున్న వాహనాన్ని నిర్మల్ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మామడ మండల శివారులో స్థానిక పోలీసులు శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో బొలెరో వాహనం( నెం. టీఎస్ 19 టి 2339 )ను నడుపుతున్న డ్రైవర్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాహనాన్ని ఆపి చెక్ చేశారు. అందులో కొబ్బరి సంచులు ఉన్నాయి. కానీ గుట్కావాసన రావడంతో మొత్తం సంచులను తీసి చెక్ చేశారు. సంచుల వెనకాల 80 అంబర్, గుట్కా సంచులు దొరికాయి.
వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని వెహికిల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ను బాధవాత్ ఆనంద్ (మొర్రిగూడెం, జన్నారం)గా పోలీసులు గుర్తించారు. అంబర్ ప్యాకెట్లు బీదర్ నుండి జన్నారం మహాలక్ష్మి ట్రేడర్స్ కు తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. డ్రైవర్, మహాలక్ష్మీ ట్రేడర్స్ ఓనర్ పవన్ పైన కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అంబర్ విలువ 13 లక్షలు ఉంటుందని తెలిపారు.