- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఐ ముద్రతో నాసిరకం హెల్మెట్లు..ఇద్దరు అరెస్టు
దిశ, క్రైమ్ బ్యూరో : బ్రాండెడ్ కంపెనీల పేరుతో, నకిలీ ఐఎస్ఐ మార్కు ముద్రతో లో క్వాలిటీ హెల్మెట్లను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ కాపిటల్ రీజియన్ ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ ఘజీయాబాద్‌లో నాణ్యతలేని హెల్మెట్లను తయారీ చేస్తున్నారు. వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తుండగా ప్రత్యేక దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఎకానమిక్ అఫెన్స్ సెన్స్ విభాగం అరెస్టు చేసింది.
ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కోవిడ్, లాక్ డౌడ్ కంటే ముందుగానే రోడ్లకు ఇరువైపులా విక్రయించే నాసికరం హెల్మెట్లపై ప్రత్యేక దర్యాప్తు చేశామన్నారు. ఈ సందర్భంగా దుకాణాదారులను, రోడ్లపై హెల్మెట్లను విక్రయించే వారిని దర్యాప్తు చేశామన్నారు. ఫేక్ హెల్మెట్లను ఘజియాబాద్ లో ధీరజ్ కుమార్, అనిల్ కుమార్ లు తయారు చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. కోవిడ్, లాక్ డౌన్ కంటే ముందుగానే 11 కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరంతా ముందుగా ఐఎస్ఐ అనుమతి తీసుకొని ఆ తర్వాత నాణ్యత లేని హెల్మెట్లను తయారు చేస్తున్నారని చెప్పారు. దీంతో వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా.. కూడా ప్రమాదాలతో మరణిస్తున్నారని అన్నారు.