- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగ బంగారం అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
దిశ,భువనగిరి: దొంగ బంగారం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను యాదాద్రి జిల్లా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లాలోని భువనగిరి పట్టణంలో తుక్కపురం చౌరస్తాలో కొందరు వ్యక్తులు దొంగ బంగారం అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు దొంగలను పట్టుకున్నట్టు డీసీపీ నారాయణ తెలిపారు.
అరెస్టైన వారిని ఉప్పతల నాగరాజు అలియాస్ ముద్దం కుటుంబరావు, గుంజి పుల్లరావు అలియాస్ పుల్లయ్య అలియాస్ శ్రీనివాస్, తమ్మి శెట్టి లక్ష్మి అలియాస్ తిరుపతమ్మ అలియాస్ తిరుపతమ్మ లక్ష్మిలుగా గుర్తించామని డీసీపీ చెప్పారు. వారివద్ద నుండి రూ. 6.5 లక్షల నగదు, దొంగ బంగారం ప్లేట్స్ 2 కిలోల 250 గ్రాములు, రెండు మోటర్ సైకిల్, మూడు సెల్ ఫోన్లు, దొంగ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని వెల్లడించారు.