గో సడక్ బంద్.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

by Anukaran |   ( Updated:2021-01-08 01:17:26.0  )
గో సడక్ బంద్.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో సడక్ బంద్‌కు పిలుపునిచ్చారు. గో హత్యలను నివారించాలని.. గోవున జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గోరక్షకులు నేడు గో సడక్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గో సడక్ బంద్ లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ గోమాతను రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరారు.

ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్‌లలో ముందస్తుగా గో భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీటీడీ పాలకవర్గ సభ్యుడు శివకుమార్‌ను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నంకు తరలించారు. గో సడక్ బంద్‌లో పాల్గొన్న జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్‌లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed