- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాటు వేసి.. మభ్యపెట్టి.. ఆ తర్వాత.

X
దిశ, ఆందోల్:
వయసు పైబడిన మహిళలను నమ్మించి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి బస్టాండ్, కల్లు దుకాణాల వద్ద వయసు పైబడిన మహిళలను ఇక్కడ దొంగలు ఉన్నారంటూ మభ్య పెట్టేవాడు. అలా వారికి జాగ్రత్తలు చెబుతూనే వారి మెడలో నుంచి బంగారు ఆభరణాలను దొంగలించేవాడు. జోగిపేట, హత్నూర పోలీస్ స్టేషన్ల పరిధిలో అతను 4 దొంగతనాలకు పాల్పడ్డాడు. జోగిపేటలో దొంగతనం చేసేందుకు రావడంతో శనివారం అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి అయిదున్నర తులాల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్టు సీఐ తెలిపారు.
Next Story