- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాడు తండ్రి.. నేడు తనయుడు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ డీసీసీబీ 9వ చైర్మెన్‌గా పోచారం భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో డీసీసీబీ చైర్మెన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ పోచారం భాస్కర్ రెడ్డిది దాఖలు కావడంతో చైర్మెన్‌గా ఎకగ్రీవం లాంఛనమైంది. కామారెడ్డి జిల్లా దేశాయ్‌పేట్ సింగిల్ విండో చైర్మెన్‌గా ఎన్నికైన భాస్కర్‌రెడ్డి, రెండో దశ ఎన్నికల్లో డీసీసీబీ గ్రూప్-ఏ కోటాలో 10స్థానాల్లో ఒక డైరెక్టర్ స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైనా విషయం తెలిసిందే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నేతగా ముద్ర పడిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మూడో తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి. గడిచిన సహకార ఎన్నికలలో డీసీసీబీ చైర్మెన్ పదవి కోసం భాస్కర్ రెడ్డి 2013లో దేశాయ్‌పేట్ సింగిల్ విండో చైర్మెన్‌గా ఎన్నికైనా నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో డైరెక్టర్‌గా ఎన్నిక కాలేక పోయారు. కానీ రెండోసారి రాష్ర్టం ఏర్పాటు తరువాత జరిగే ఎన్నికల్లో తన తనయుడికి డీసీసీబీ చైర్మెన్ పదవి కోసం ఏకంగా సీఎం కేసీఆర్ అశీస్సులు తీసుకున్న తరువాతనే చివరి నిమిషంలో తన తయుడు భాస్కర్ రెడ్డిని బరిలో నిలిపారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు డీసీసీబీ కోసం బరిలో నిలిచినా అధిష్టానం అశీస్సులతో భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఛైర్మెన్‌గా ఎన్నిక కాగలిగారు. ఈ ఎన్నికలతో అసమ్మతి బయటకు రాకుండా ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి నడిపిన మంత్రాంగం ఫలించింది. పోచారం భాస్కర్ రెడ్డి చైర్మెన్ కావడంతో నిజామాబాద్ డీసీసీబీకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహించిన అరుదైన రికార్డు నమోదైంది. ఉమ్మడి రాష్ర్టంలో నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మెన్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి 1987నుంచి 1980 వరకూ పని చేశారు. నాల్గో డీసీసీబీ చైర్మెన్‌గా ఎన్నిక కావడానికి నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన బాన్సువాడలోని బుడ్మీ పీఏసీఎస్ చైర్మెన్‌గా ఎన్నికైన తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు.