- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎకానమీ బూస్టప్‌కు మన్మోహన్ మూడు సూచనలు

దిశ, వెబ్ డెస్క్: కరోనా(corona)తో తీవ్రంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను(financial crisis) పునరుజ్జీవం (resurrection) చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు సూచనలు(advise) చేశారు. బీబీసీతో ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మార్చిలో అనివార్యమైన చర్యనే అయినప్పటికీ దాని అమలు, ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటించడం ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని (severe impact) చూపిందన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘకాలం మందగమనం (slowdown) లోకి వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. అయితే, ఆర్థిక వ్యవస్థ (economy) తిరిగి సాధారణ స్థితికి రావడానికి మూడు సూచనలను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ప్రజల ఉపాధిని కాపాడుతూ.. నేరుగా నగదు లభ్యతకు కృషి చేయాలని, తద్వారా వారి కొనుగోలు శక్తి (purchasing power)ని కాపాడాలని మొదటి సూచనగా చెప్పారు. ప్రభుత్వం స్వయంగా క్రెడిట్ గ్యారంటీ (cridet guarenty) కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారాలకు సరిపడా పెట్టుబడులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇన్‌స్టిట్యూషనల్ అటానమీ, ప్రాసెసెస్‌లతో ఫైనాన్షియల్ సెక్టార్‌ను గాడిలో ఉంచాలని సూచించారు.
నేరుగా నగదు బదిలీలపై మాట్లాడుతూ, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రుణాలతో జీడీపీ (gdp)లో అప్పుల రేషియో పెరుగుతుందని చెప్పారు. ప్రజల ప్రాణాలు, సరిహద్దులు, ఉపాధిని నిలిపి ఉంచేవైతే, ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా (boost) పనిచేస్తాయని భావిస్తే రుణాలు తీసుకోవడానికి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అప్పులు చేయడానికి సిగ్గు పడటం కాదు, వాటిని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలి అనే విషయంపైనే దృష్టి ఉండాలని తెలిపారు.
కరోనా మహమ్మారికి ముందే భారత ఆర్థిక మందగమనంలో ఉందని, జీడీపీ వృద్ధి రేటు 2019-20లలో 4.2శాతంలో దశాబ్దంలో కనిష్టంగా నమోదైందని మన్మోహన్ సింగ్ వివరించారు. ఇప్పుడు భారత్ క్రమంగా అన్‌లాక్ (unlock) చేస్తూ ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిస్తున్నదని, కానీ, కనిపిస్తున్న భవిష్యత్తు మాత్రం అనిశ్చితిగానే ఉందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో కుచించుకుపోవచ్చునని కొందరు నిపుణులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణలకు పేరుగాంచిన మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, సంక్షోభం అనే పదాన్ని తాను వాడాలని భావించట్లేదని, అయితే, కరోనానంతరం మనదేశ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘకాలం మందగమనం కొనసాగవచ్చునని అంచనా వేశారు. ఈ మందగమనం మానవతా సంక్షోభం ద్వారా ఏర్పడిందని వివరించారు. దీన్ని కేవలం ఆర్థిక పరమైన అంకెల ద్వారా కాదు, భారత సమాజంలోని సెంటిమెంట్ల నుంచి చూడాలని సూచించారు.