కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రధాని మోడీ

by Anukaran |
PM Narendra Modi
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు చేస్తున్న కృషి మరువలేనిది అని అన్నారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాక్సిన్ వేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Advertisement

Next Story