అయోధ్యలో మోడీ ప్రసంగం.. ఏమన్నారంటే ?

by Anukaran |   ( Updated:2020-08-05 04:22:44.0  )
అయోధ్యలో మోడీ ప్రసంగం.. ఏమన్నారంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీరాముడు.. భారతీయ మర్యాదకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

దేశమంతా రామమయమైందని, రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. మన సంకల్పం నెరవేరింది.. ప్రార్థనలు ఫలించాయని, ఎందరో బలిదానాల ఫలితమే మందిర కల సాకారం అయ్యిందంటూ మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారత దేశ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని, ప్రపంచమంతా ఇప్పుడు జానకీరాములు కొలువైన అయోధ్య వైపు చూస్తోందని, భారత కీర్త పతాక యుగయుగాలకు గుర్తుండిపోతదని ఆశాభావం వ్యక్తం చేశారు.

మన రాముడి అద్భుత శక్తులను చూశామని, ఇప్పటికీ రాముడు మనందరి గుండెల్లో కొలువై ఉన్నాడు అని మోడీ పేర్కొన్నారు. రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వారు నన్ను ఆహ్వానించడం నా పూర్వజన్మసుకృతమన్నారు. రాముడి ప్రతి పనిని హనుమంతుడే పూర్తి చేసేవాడని, ఈ దృష్టి కోణంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజకు ముందు హనుమాన్ గుడిని సందర్శించి ఆశీర్వాదం పొందాను అని మోడీ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed