- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ వస్తున్నారు.. కేసీఆర్‌కు నో ఎంట్రీ..?
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ హైదరాబాద్ రాక ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ నుంచి ప్రధాని ప్రత్యేక విమానంలో నేరుగా హకీంపేటకు చేరుకోనున్నారు. అనంతరం ఆయన భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని మోడీ పరిశీలించనున్నారు. సాయంత్రం 4.50 హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి మోదీ ఢిల్లీ వెళ్లనున్నారు.
కాగా, ఈ సారి ప్రధాని పర్యటనలో సంప్రదాయాలకు పీఎంవో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని స్వాగతం పలికేందుకు టీఎస్ గవర్నర్, సీఎంకు అనుమతి నిరాకరించారు. తెలంగాణ సీఎస్‌కు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ ఫోన్ చేశారు. హకీంపేటకు ఎయిర్‌పోర్ట్‌కు సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని వివేక్ చెప్పారు. కాగా, ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురికే అనుమతి ఉందని పీఎంవో స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, మేడ్చల్ కలెక్టర్, సైబరాబాద్ సీపీ, హకీంపేట ఎయిర్‌పోర్టు కమాండెంట్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. పీఎంవో తీరుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.