ముగిసిన ప్రధాని అత్యవసర మీట్.. ఆలస్యం వద్దన్న మోడీ..!

by Shamantha N |
ముగిసిన ప్రధాని అత్యవసర మీట్.. ఆలస్యం వద్దన్న మోడీ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో శనివారం రాత్రి 8 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి కిందటే సమావేశం ముగియగ.. పలు కీలక అంశాలపై ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత, సామర్థ్యం పెంపు, విదేశీ వ్యాక్సిన్ దిగుమతిపై ప్రధాన చర్చ నడిచినట్లు సమాచారం.

45ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ కు మరో ప్రత్యామ్నాయం లేదని మోడీ స్పష్టంచేశారు. లక్ష ఆక్సిజన్ సిలిండర్లు సేకరించి రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులను ఆదేశించారు. మంజూరైన 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దేశ వ్యాప్తంగా పెంచాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story