మిషన్ కాశ్మీర్ @మోడీ మదిలో ఏముంది..?

by Shamantha N |   ( Updated:2021-06-24 04:49:04.0  )
మిషన్ కాశ్మీర్ @మోడీ మదిలో ఏముంది..?
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి హోదా ఆర్టికల్-370, అధికరణ 35-A రద్దయ్యాక.. సుమారు రెండేళ్ల తర్వాత కేంద్రం ఆ రాష్ట్ర ముఖ్యనేతలతో కీలక సమావేశానికి సిద్ధమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో రాష్ట్ర భవితవ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్‌‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం 2019 ఆగస్టు 5న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాన్ని ప్రధాని మోడీ తీసుకోనున్నట్లు సమాచారం. డీలిమిటేషన్ కమిషన్‌కు సహకరించాలని జమ్మూ ముఖ్యనేతలను ప్రధాని కోరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కీలక సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జితేంద్రసింగ్‌లు కూడా ఉన్నారు. ఇదిలాఉండగా, జమ్మూ స్వతంత్ర ప్రతిపత్తి తొలగించాక కశ్మీర్ లోయలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కొన్నినెలల పాటు మాజీ ముఖ్యమంత్రులు, వేర్పాటు వాద లీడర్లను కేంద్రం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. కశ్మీర్ పై వాయిస్ వినిపించేందుకు ఇన్ని రోజులు వారికి అవకాశం రాలేదు. తొలిసారి ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో వీరు పాలుపంచుకుంటుండటంతో మరోసారి జమ్మూ స్వతంత్ర ప్రతిపత్తి, రాష్ట్ర ఎన్నికల విషయమై కాశ్మీరీల హక్కుల కోసం తమ వాయిస్ గట్టిగా వినిపించాలని అక్కడి లీడర్లు అంతా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, జమ్మూ భవితవ్యంపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నదో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed