గుడ్ న్యూస్.. రేపు మధ్యాహ్నమే వారి ఖాతాల్లోకి డబ్బులు

by Anukaran |   ( Updated:2021-08-08 09:49:47.0  )
గుడ్ న్యూస్.. రేపు మధ్యాహ్నమే వారి ఖాతాల్లోకి డబ్బులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు రేపు మధ్యాహ్నం నుంచి ప్రధానమంత్రి కిసాన్​ నిధి కింద నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతులకు రూ.19,500 కోట్లు బదిలీ చేయనున్నారు. నిధులను విడుదల చేసిన అనంతరం మోడీ ప్రసంగించనున్నారు. కాగా 2018లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏడాదికి 3 వాయిదాల్లో ఒక్కో రైతుకు కేంద్రం రూ.6 వేలు చెల్లిస్తోంది ఇప్పటివరకు 1.38 లక్షల కోట్లను కేంద్రం రైతులకు నేరుగా బదిలీ చేసింది. తెలంగాణలో ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి కలిగిన 27 లక్షల మంది రైతుల్లో అర్హులైన 20 లక్షలకుపైగా రైతుల వివరాలను పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారులు నమోదు చేశారు.

ఇలా తనిఖీ చేసుకోవాలి

* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారు తనకు సొమ్ములు బ్యాంకులో వచ్చినవీ లేనిదీ ఇలా తెలుసుకోవచ్చు.
* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి.
* హోమ్ పేజీలో ఉన్న ‘లబ్ధిదారుని స్థితి’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు తెరుచుకునే విండోలో, ఏదైనా ఎంపికను ఎంచుకోండి.

* ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.
* ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘డేటాను పొందండి’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా అక్కడే కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి

పథకం డబ్బులు ఖాతాలో పడనట్లైతే..

కొన్న కొన్ని సార్లు ఏదైన సమస్య తలెత్తినప్పుడు పథకం డబ్బులు అకౌంట్‌లో జమ కావు. అందువలన మీకు డబ్బులు పడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక వేళ మీరు లబ్ధిదారుల నుంచి డబ్బులు పడనట్లైతే అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించండి. PM-Kisan హెల్పలైన్155261 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800115526 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story