ప్రాణప్రదాత ‘ప్లాస్మా’.. సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్

by Shyam |   ( Updated:2021-04-29 00:36:58.0  )
ప్రాణప్రదాత ‘ప్లాస్మా’.. సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్
X

దిశ, ఫీచర్స్ : కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం అందరికీ విదితమే. అయితే అంతే సంఖ్యలో రికవరీ అవుతుండగా, కొంతమంది మాత్రం ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో ప్రాణాపాయా స్థితిలో కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్నారు. ఇలాంటి వారికి వైద్యులు ‘ప్లాస్మా థెరపీ’ అందిస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో చాలామంది ప్లాస్మా డోనేషన్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రతీ రోజు సోషల్ మీడియాలో ‘ప్లాస్మా’ కావాలంటూ వేలాది సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘ప్లాస్మా డోనేషన్’ ప్రాధాన్యత గురించి ఓ మెసేజ్ వైరల్ అవుతుంది. అందులోని సమాచారం ప్రకారం కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కేవలం 3 శాతం మంది ప్లాస్మాదానం చేసినా, ప్రతీ రోజు 3,93,257 మంది ప్రాణాలను కాపాడొచ్చు. దీంతో డెత్ కౌంట్ కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఈ సందర్భంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా పలు స్వచ్ఛంద సంస్థలు, పలవురు ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నెటిజన్లు ఈ మెసేజ్‌ను అందరికీ తెలిపేందుకు రీ పోస్టులు చేస్తూ, వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed