- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. 'అఖండ' సీక్వెల్‌కు ప్లాన్?
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ సినిమాగా ‘అఖండ’ నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. బాలయ్య-బోయపాటి సినిమా అంటేనే ప్రేక్షకులు, అభిమానులు, సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
బాలయ్య నటన, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో భారీ కలెక్షన్లతో అఖండ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో బాలయ్య అభిమానులకు మరింత కిక్కించే ఓ వార్త బలంగా వినిపిస్తోంది.
అఖండకు సీక్వెల్ ఉండనుందనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సీక్వెల్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎండింగ్‌లో ‘నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను.. నేను హామీ ఇస్తున్నా’ అంటూ అఖండ క్యారెక్టర్‌లో ఉన్న బాలకృష్ణ మరో క్యారెక్టర్ లో ఉన్న బాలకృష్ణ కూతురికి హామీ ఇచ్చి వెళతాడు. దీంతో ఆ పాపకు మరో రూపంలో సమస్య వస్తుందని, అప్పుడు అఖండ మళ్లీ వస్తాడని, దీనినే సీక్వెల్ గా తీయనున్నారనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే..