- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
’కేరళ అంతటా లాక్‌డౌన్ ఉండదు‘
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్ -19 స్థానికంగా వ్యాప్తి చెందుతున్నక్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో లాక్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని.. అఖిలపక్ష సమావేశం కోరిన ఈ నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే వచ్చే నెల నాటికి కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్షిష్టమైన సమయంలో ప్రజల తమ రక్షణ విషయంలో జాగ్రత్త పడాలని సూచించారు. వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్ర రాజధానిలో మాత్రం మరో వారం లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, సోమవారం కేరళలో 702 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,727 చేరింది. ఇందులో 10,054 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 9,613 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 64కి పెరిగింది.