- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలిగ్ మిగ్-29 ఫైటర్ జెట్..పైలట్ మిస్సింగ్
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ నావికాదళంలో సేవలందిస్తున్న మిగ్-29 ఫైటర్ జెట్ విమానం కూలిన ఘటనలో ఓ ఫైలట్ మిస్సయ్యాడు. అతని కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ నేటికీ ఇంకా ఆచూకీ దొరకలేదని నేవీ అధికారి తెలిపారు.
రెండ్రోజుల కిందట యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ఏయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి రెండు సీట్ల కెపాసిటీ గల మిగ్-29 ఫైటర్ జెట్ టేక్ ఆఫ్ అయింది. గగన వీధిలో విన్యాసాలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉండగా ఒకరిని నేవీ సిబ్బంది రక్షించారు.
Pilot missing for 2 days after MiG-29K crash, navy intensifies search opshttps://t.co/BUF3JWfQeU pic.twitter.com/Ah8MGvPwJ7
— Hindustan Times (@htTweets) November 28, 2020
భారత నావికాదళానికి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు శనివారం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. అందులో ఒకరి ఆచూకీ గురువారం లభ్యంకాగా, రెండో పైలట్- నావికాదళం కమాండర్ నిశాంత్ సింగా ఇప్పటికీ దొరకలేదు. రక్షణ చర్యలను తీవ్రతరం చేయడానికి అదనపు యుద్ధనౌకలు, విమానాలు మరియు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. కాగా, యుుద్ధ విన్యాసాల్లో ప్రమాదానికి గురైన జెట్లలో ఇది నాలుగో మిగ్ -29గా నేవి అధికారులు తెలిపారు.