శంషాబాద్‌లో ప్రమాదం.. పైలట్ మృతి

by Anukaran |
శంషాబాద్‌లో ప్రమాదం.. పైలట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో పైలట్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ పై సోమవారం కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ గా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇటు, కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed