పిల్లాయిపల్లి కాలువకు గండి.

దిశ,మునుగోడు:
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పిల్లాయిపల్లి కాలువకు గండి పడింది. దీంతో చౌటుప్పల మండల పరిధిలోని చిన్నకొండూరు,పెద్దకొండూరు, మందోళ్ళగూడెం, నేలపట్ల గ్రామాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. కాగా నీట మునిగిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి నాగరాజు పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక అంచనా ప్రకారం 130 మంది రైతులకు సంబంధించి 165 ఎకరాలలో పంట నష్టం జరిగిందని అంచనా వేశామని తెలిపారు. ముఖ్యంగా 140 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు నివేదికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

Advertisement