- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంకల్పంతో వైకల్యాన్ని ఓడించాడు
దిశ, వెబ్‌డెస్క్: అతనో కార్పెంటర్.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నది ఆయన ఆలోచన. సొంతంగా బిజినెస్ ప్రారంభించి, పది మందికి పని కల్పించాలన్నది ఆయన లక్ష్యం. అయితే బిజినెస్ ప్రారంభించేందుకు పెట్టుబడి కోసం తాను కొన్ని రోజులు కార్పెంటర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా కొంత డబ్బు సంపాదించిన తర్వాతే వ్యాపారంలోకి దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే బిల్డింగ్ పైన వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి వీల్ చైర్‌కే పరిమితమైన ఆయన.. తన ఉక్కు సంకల్పంతో వైకల్యాన్ని ఎలా ఓడించాడు? అతని దృఢచిత్తానికి విధి ఎలా తలవంచింది? ఆత్మస్థైర్యంతో తన కలను ఏ విధంగా సాకారం చేసుకున్నాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, మల్పోర గ్రామంలోని నోటిఫైడ్ ఏరియాకు చెందిన అర్షిద్ అహ్మద్ వాని ఓ కార్పెంటర్. అయితే తన జీవితం కార్పెంటర్ దగ్గరే ఆగిపోకూడదని భావించిన అర్షిద్.. తనే సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింది. 2016లో జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లు పెరలైజ్ కావడంతో అర్షిద్ నడవలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమైన అర్షిద్.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తన ఆలోచనలన్నీ లక్ష్యం చుట్టూ తిరగుతుండేవి. ఈ క్రమంలోనే తను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లు బంధువులకు చెప్పాడు. వీల్ చైర్‌లో ఉన్నప్పటికీ యువకులకు ఉపాధి కల్పిస్తానని, వారికి గైడెన్స్ ఇస్తూ కార్పెంటరీ వర్క్ నేర్పిస్తానని వివరించాడు. బంధువులు ఓకే చెప్పడంతో ఆఫీస్ స్టార్ట్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
బంధువుల సహకారంతో కార్పెంటరీ వర్క్ యూనిట్ ప్రారంభానికి రుణం ఇవ్వాలని జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద దరఖాస్తు చేశాడు. లోన్ మంజూరు కావడంతో కార్పెంటరీ యంత్రాలు కొనుగోలు చేసి, పని ప్రారంభించాడు. వీల్ చైర్‌లో ఉంటూనే నేర్పుతో తను పని చేస్తూ, అదే యూనిట్‌లో పలువురు యువకులకు గైడెన్స్ ఇస్తున్నాడు. సంకల్పంతో వైకల్యాన్ని ఓడించి తాను తన కళ్ల మీద నిలబడటమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రస్తుతం తన బిజినెస్ బాగా నడుస్తుందని, తలుపులు, కిటికీలకు ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నాడు. వికలాంగులు తమ కలల సాకారం చేసుకునేందుకు ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదని, ఆత్మవిశ్వాసమే బలంగా ముందుకు సాగాలని, సొంతంగా సంస్థలు స్థాపించే మార్గాలు వెతకాలని అహ్మద్ సూచిస్తున్నాడు. కాగా, అహ్మద్ సంకల్పం గొప్పదని, వైకల్యాన్ని అధిగమించి తన కలను సాకారం చేసుకున్నాడని పుల్వామా జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి ముస్తక్ అహ్మద్‌ను అభినందించాడు. అహ్మద్‌కు నెలకు రూ.1,000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.