డ్యాన్స్‌తో శారీరక, మానసిక ఆరోగ్యం

by sudharani |
డ్యాన్స్‌తో శారీరక, మానసిక ఆరోగ్యం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: వేడుకలు, సంతోషకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం. కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది నగర యువత. అదే మంటే అదోక ఫిట్‌నెస్ మంత్రంగా చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం, పబ్‌లలో సైతం నృత్యంతో కసరత్తు చేస్తున్నారు. యోగా, జిమ్, జాగింగ్, వాకింగ్‌లాగే ఇప్పుడు నృత్యం ఓ వ్యాయామ క్రియగా మారింది.

జిమ్ కెళ్లి బరువులు ఎత్తుతూ, అద్దంలో పదేపదే కండలు చూసుకుంటూ చేయడం బోరింగ్‌గా పీలయ్యేవారు..! పార్కులో రోజు ఏం నడుస్తాం.. అనుకునేవారికి ఇప్పుడు డ్యాన్స్ ఫిట్‌నెస్ ఒక మంచి అవకాశంగా కనపడుతోంది. వ్యాయామం చేయాలనుకునేవారు. దాంతోపాటు డ్యాన్స్‌ను ఇష్టపడేవారు ఎక్కువగా డ్యాన్స్ వ్యాయామాన్ని కోరుకుంటున్నారు. వాస్తవానికి ఆ పద్ధతి వ్యాయామం పదేళ్ల క్రితమే పరిచయమైనా కరోనా వల్ల ఏడాది పాటు డ్యాన్స్ స్టూడియోలు మూతపడ్డాయి. ఈ మధ్యకాలంలో నగర యువత నోళ్లలో నానుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు, యువత, కుర్రకారు డ్యాన్స్ వర్కవుట్లపై మక్కువ చూపుతున్నారు. ఈ డ్యాన్స్ వ్యాయామం పూర్తిగా మన దేశంలో మొదలైన ట్రెండ్. ఢిల్లీ, ముంబాయి వంటి నగరాల్లో మొదలై బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్ నగరాల యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్లన్నీ డ్యాన్స్ వ్యాయామ కేంద్రాలుగా మారాయి. డ్యాన్స్ మాస్టర్స్ ఫిట్‌‌నెస్ కోచ్‌ల అవతారం ఎంతారు. డ్యాన్స్ ఫిట్‌నెస్ సెంటర్లు ప్రస్తుతం నగరంలో 500 పైనే ఉంటాయంటున్నారు డాన్స్ మాస్టర్ సుధీర్.

ఆదాయ వనరుగా..

మ్యూజిక్, డ్యాన్స్ కలగలసిన నృత్య ఫిట్ నెస్ నేర్పించే వారికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. సినిమా, టీవీ రంగాల్లో కొరియోగ్రాఫర్ గా రాణించాలనుకునే యువత ముఖ్యంగా డ్యాన్స్ ఫిట్ నెస్ వర్కవుట్లు నేర్పించడాన్ని ప్రత్యేక ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. డ్యాన్స్ వ్యాయామ కోచింగ్ సెంటర్లు నెలకు రూ.1000నుంచి రూ.5వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అవి నృత్య శిక్షకుడు, ప్రాంతం ఆధారంగా ఫీజు ఉంటుంది. సహజంగా జాగింగ్ జిమ్ వంటి చోట్ల కొద్ది రోజులు వెళ్లి మళ్లీ మానేస్తుంటారు. కానీ బృంద వ్యాయామానికి అలవాటైతే మాత్రం మధ్యలో మానేయడం తక్కువే అంటున్నాడు డ్యాన్స్ కోచ్ శ్రీనాథ్.

డ్యాన్స్ వర్కవుట్లు ఇవే..

బాలీ ఫిట్ నెస్, జోక్వా, మసాలా భాంగ్రా, బూట్ క్యాంప్, క్రాస్ ఫిట్, జుంబా, ఎరోబిక్స్, సల్సా వంటి నృత్యా రీతుల్ని ముఖ్యంగా ఫిట్ నెస్ వర్కవుట్లుగా చేస్తున్నారు. వీటిలో ఒక్కో నృత్యం ఒక్కో రకంగా ఉంటుంది. సినిమాలను ఫిట్ నెస్ నృత్యానికి తగిన విధంగా మారుస్తారు. ఇది కండరాల పటుత్వానికి మంచి వ్యాయామం. పంజాబీ జానపద నృత్యం, మసాలా భాంగ్రా అధిక బరువు తగ్గేందుకు, శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేందుకు ఇది సరైన వ్యాయామంగా చెబుతున్నారు ఫిట్ నెస్ నిపుణులు. శరీరాన్ని ఎల్, కే, ఓ ఆకారాలుగా వొంచుతూ చేసే వ్యాయామం జోక్వా, దీనిలో హోరెత్తే సంగీతంతోపాటు, దక్షిణాప్రికా నృత్య భంగిమలు ఉంటాయి. శరీర భాగాల్లో అసహజంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు జోక్వా ఉపకరిస్తోంది.

బీ కేర్ ఫుల్..

వ్యాయామం శరీర, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆ వ్యాయామ శిక్షణ సరైన నిపుణుల వద్ద తీసుకోవాలి. లేకుంటే సమస్యలు తప్పవు. ముఖ్యంగా డ్యాన్స్ ఫిట్ నెస్ లో నృత్య భంగిమ తర్వాత, ఒకటి వరుస క్రమంలో, ఒక పద్దతి ప్రకారం వ్యాయామం చేయిస్తారు. అవగాహన లేని వారు ఇష్టాసుసారంగా వర్కవుట్లు చేయించడం వల్ల కండరాలు పట్టేయడం, నొప్పుల వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎవరికి వారు సొంతంగా ఈ వ్యాయామం చేసుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశమే ఎక్కువ. ఏమైనా లోగడ నొప్పులు, సమస్యలు ఉన్నట్లయితే కోచ్ కి ముందుగా తెలుపాలి. వ్యాయామం అంతిమ ఫలితం శారీరక, మానసిక ఆరోగ్యానికే కనుక మంచి ఆహారం తీసుకోవాలి. సీపీఆర్ శిక్షణ పొందినవారు, లేక రీబాక్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వ్యాయామ నిపుణుల వద్ద మాత్రమే శిక్షణ తీసుకోవడం మంచిది.

నృత్యంతో శారీరక, మానసిక ఆరోగ్యం..

ప్రస్తుతం ఏరోబిక్స్, జుంబా నృత్యాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో అనేక రకాల నృత్యా రీతులున్నాయి. డ్యాన్స్ లో ప్రతీ రీతి ప్రధాన లక్ష్యం ఫిట్ నెస్ కోసమే. కార్డియో, మజిల్ ఫిట్ నెస్, బ్యాలెన్సింగ్, ప్లెక్సీబిలిటీ వీటన్నింటి కోసం రకరకాల నృత్యరీతులను చేయిస్తాం. నిపుణుల వద్ద మాత్రమే శిక్షణ తీసుకోవాలి. యువతతోపాటు 45నుంచి 50ఏళ్ల మధ్య వయసు వారు కూడా డ్యాన్స్ ఫిట్ నెస్ పై ఆసక్తి చూపుతున్నారు. సంగీతం, నృత్యం, వ్యాయామం మూడు కలిసిన ఈ వర్కవుట్ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.

– శ్రీనాథ్, ఫిట్ నెస్ ట్రైనర్

Advertisement

Next Story