- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారంలో యువతి పెళ్లి..అంతలోనే ఘోరం
దిశ, వెబ్ డెస్క్ : వారం రోజుల్లో ఆ యువతి పెళ్ళి. కుటుంబ సభ్యులు పెళ్ళి పనుల్లో నిమగ్నమయ్యారు. బంధువులు, స్నేహితులకు పెళ్ళి కార్డులు పంచేస్తున్నారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో పెళ్ళి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టాలనుకున్న ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం గట్టుకిందపల్లిలో దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై హత్యాయత్నం జరిగింది. దుండగులు బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కాలిన గాయాలతో ఆహాకారాలు చేయడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్థానికులు బాధితురాల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కాగా బాధితురాలికి వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. అంతలోపే ఈ దారుణం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బాధితురాల్ని హత్య చేసింది ఎవరు..? అందుకు కారణాలేంటో తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.