- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవా క్యాంపునకు తరలిన పేట ప్రజాప్రతినిధులు
దిశ, అశ్వారావుపేట టౌన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు గోవా కేంద్రంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ క్యాంప్ ఏర్పాటు చేసింది. పార్టీ వర్గాలు ముందుగా అనుకున్న ప్రకారం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్దకు ఉదయం నుంచే నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు చేరుకున్నారు. అల్పాహారం అయిన అనంతరం అధినాయకత్వం సిద్ధం చేసిన రెండు గరుడ బస్సులలో 48 మంది ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో గోవాకు పయనమయ్యారు. వీరు ముందుగా హైదరాబాద్ వెళ్లి అక్కడి నుండి స్లీపర్ కోచ్ బస్సులలో బుధవారం ఉదయానికి గోవాలోని క్యాంపుకు చేరుకుంటారని తెలుస్తుంది. ఈ నెల పదవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల పోలింగ్ ఉండడంతో తొమ్మిదో తేదీన అంటే ఒక రోజు ముందుగానే వీరంతా తిరిగి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ క్యాంపుకి అశ్వారావుపేట మండలంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు కూడా వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.