- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారు బోల్తాపడి ఒకరు మృతి
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కారు అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ.కృష్ణయ్య వివరాల ప్రకారం… దత్తారం గ్రామానికి చెందిన కుందేళ్ళ లింగస్వామి(28), అదే గ్రామానికి చెందిన నూకం కృష్ణ ఇంటి ఎదుట ఉన్న కారును ఓనర్‌కు తెలియకుండా తీసుకెళ్లారు. లింగస్వామి, రాముడు ఇరువురు కలిసి సాయిన్‌పేట వైపు వెళ్తుండగా అదుపుతప్పి మొగిలి రెడ్డి పొలం వద్ద రహదారి పక్కన ఉన్నటువంటి గోతిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లింగస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. రాముడికికి తీవ్ర గాయాలు కావడంతో లింగాల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని వెంటనే సంఘటనా స్థలానికి లింగాల ఎస్సై కృష్ణయ్య చేరుకొని వివరాలు రాబట్టారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story