- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో టోకరా.. నిందితుడు అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో : సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానంటూ కేన్సర్ పేషెంట్ నుంచి రూ.2 లక్షలకు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహదూర్ ప్రాంతానికి చెందిన నసీర్ గియాస్ కొద్ది నెలల క్రితం కేన్సర్ వ్యాధితో భాదపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ ఓమెగా ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పాతబస్తీకి చెందిన మౌలానా అలీ ఖాద్రీ ఓమెగా ఆస్పత్రికి వెళ్లి పేషెంట్‌ను పరామర్శించాడు.
చికిత్సకు భారీగా ఖర్చవుతుందంటూ ఖాద్రీకి పేషెంట్ చెప్పాడు. దీంతో స్పందించిన ఖాద్రీ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తనకు అత్యంత సన్నిహితుడనీ… సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కావాల్సినంత మొత్తాన్ని మంజూరు చేయిస్తానని చెప్పాడు. అందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఖాద్రీ మతపెద్ద కావడంతో సదరు పేషెంట్ నమ్మి రూ. 2 లక్షలు ముట్టజెప్పాడు. అప్పట్నుంచి ఖాద్రీ మొఖం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితులు ట్విట్టర్ ద్వారా ఎంపీ సంతోష్ ను సంప్రదించారు. దీంతో ఎంపీ సంతోష్ డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌లకు అదే ట్వీట్‌ను ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరగా, సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంగళవారం ఖాద్రీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.