- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన రెండు నెలలకే.. ఉరేసుకుని యువకుడి మృతి
దిశ, చేవెళ్ల : అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. చేవెళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బ్యాగారి శ్రీకాంత్ తండ్రి శెంకరయ్య(21) అనే యువకుడు 2నెలలు కిందట కౌకుంట్ల గ్రామానికి చెందిన మనిలాను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. దసరా పండుగ సందర్బంగా భార్య వారి అమ్మగారి ఇంటికి వెళ్ళింది.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ అతని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. పరిశీలించన డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య మనిలాను విచారించగా తన భర్త ఎంతో మంచివాడని, తనకు రూ. 3 లక్షల అప్పు ఉందని అప్పుడప్పుడు చెప్పి బాధపడేవాడని తెలిపింది. అప్పు బాధ భరించలేకే ఉరేసుకుని చనిపోయినట్టు విచారణలో తెలిపింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.