- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హార్వెస్టర్ యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం
by Sumithra |

X
దిశ, నారాయణఖేడ్:
హార్వెస్టర్ యంత్రంలో పడి ఓ యువకుడు దుర్మరణం చెందడంతో సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లో కెళితే… మండల కేంద్రమైన కంగ్టికి చెందిన బాలాజీ(35) అనే యువకుడు హార్వెస్టర్ యంత్రంతో ఉపాధి పొందుతున్నాడు. యంత్రానికి ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి రైతుల పొలాల వద్దకు వెళ్లి సోయా పంట నూర్పిడి ఆయన చేసేవారు. ఈ క్రమంలో కంగ్టిలోని చౌకన్ పల్లి శివారులో సోయా పంటను సోమవారం హార్వెస్టర్ నూర్పిడి చేస్తున్నారు. యంత్రం పై నిలబడి సోయా పైరు అందిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ యంత్రంలో పడి పోయాడు. ఇది గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ యంత్రాన్నినిలిపివేశారు. అప్పటికే బాలాజీ ప్రాణాలు వదిలాడు. కాగా బాలాజీ కి భార్య, కుమారుడు ఉన్నారు.
Next Story