- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకృతి ప్రకోపానికి మరొకరు బలి..
by Sridhar Babu |

X
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు పలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో కురిసిన వర్షానికి తోడు పడిన పిడుగు పాటుకు ఓ వ్యక్తి మృతిచెందాడు.వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన సారిక కుమారస్వామి(40) ఇసుక ర్యాంపులో లారీలకు పట్టాలు కడతున్నాడు. అదే సమయంలో ఓ మోస్తరు వర్షం, ఈదురు గాలులు వీచాయి.ఈ క్రమంలోనే కుమారస్వామికి అత్యంత సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతనితో పాటు పని చేస్తున్న మరో వ్యక్తి సంకపల్లి మహిబూబ్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story