- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగిత్యాలలో పిడుగుపాటు..ఒకరు మృతి
by Sridhar Babu |
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో పిడుగు పాటుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన నక్క హరీష్(20) తన మిత్రుడు మహంకాళి గణేష్‌తో కలిసి హరీష్ ఇంటిముందున్న మర్రి చెట్టు కింద నిలబడి ఉన్నారు. అప్పటికే ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకుని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూడిన పిడుగు మర్రి చెట్టుపై పడటంతో దాని కింద ఉన్న స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నక్క హరీష్ మరణించగా, తీవ్రగాయాలైన గణేష్‌కు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Next Story