జోరువాన..పిడుగు పాటుకు ఒకరు మృతి

by Sridhar Babu |
జోరువాన..పిడుగు పాటుకు ఒకరు మృతి
X

దిశ, కరీంనగర్ :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వర్షానికి తోడు వచ్చిన పిడుగుపాటుకు కూలీ గుడుగుల రాములు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలోని పలు చోట్ల కూడా వర్షం పడటంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది.

Advertisement

Next Story