- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాను వేసిన వల తనకే ఉరితాడైంది..
by Sumithra |

X
దిశ, బోధన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన బోయి గంగారాం (55) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి వలకు చుట్టుకుని మృతి చెందినట్టు ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 23న గ్రామ శివారులోని పెద్ద వాగు చెక్ డ్యాంలో చేపల కోసం వలలు వేసాడు. సాయంత్రం వలలు తీసేందుకు వెళ్లిన గంగారం ప్రమాదవశాత్తు వల కాళ్లకు, చేతులకు చుట్టుకోవడంతో నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు.
ఆదివారం ఉదయం శవాన్ని బయటకు తీయించి పంచనామా జరిపారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు అబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు.
Next Story