కెనాల్ గుంతలో పడి వ్యక్తి మృతి..

దిశ, సిద్ధిపేట :

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కెనాల్ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామ శివారులో ఆదివారం వెలుగులోకివచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మేడిపల్లి గ్రామానికి చెందిన రమేష్ యాదవ్(24) సిద్దిపేటలోని రిలయన్స్ ట్రెండ్స్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పని ముగించుకుని 11గంటల ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఇబ్రహీంనగర్ మీదుగా మెడిపల్లికి వచ్చే దారిలో రోడ్డుకు అడ్డంగా తీసిన గుంతలో ఉదయం ఏం పని జరగలేదు.

మధ్యాహ్నం కెనాల్ కాలువను రోడ్డుకు అడ్డంగా తీసి ఎలాంటి హెచ్చరిక, సూచిక బోర్డులు పెట్టకుండా సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ దారి గుండా వచ్చిన రమేష్‌యాదవ్ ఆ గుంతను గమనించలేదు. దీంతో బైక్‌తో సహా అందులో పడిపోయాడు. ఆ సమయంలో గుంతలో నీరు అధికంగా ఉండటంతో ఊపిరాడక మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే రమేష్ మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. రమేష్ మృతికి ఇంజినీరింగ్ పనులు చేపడుతున్న మెగా సంస్థ బాధ్యత వహించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement