నక్సలైట్ల పేరుతో బెదిరింపులు… వ్యక్తి అరెస్టు

దిశ వెబ్ డెస్క్:
నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం….బంజారాహిల్స్ లోని అపర్ణ కన్ స్ట్రక్షన్ కంపెనీకి మెహిదీపట్నానికి చెందిన నగేశ్ ఈనెల 12 న వెళ్లారు. ఎండీ ఉన్నారా అంటూ ఆఫీస్ సిబ్బందిని అడిగారు. అయితే ఎండీ లేకపోవడంతో ఏజీఎం సూర్యారావును కలవాలని ఆయనకు సిబ్బంది సూచించారు. కాగా సూర్యారావుకు నగేశ్ సోమవారం ఫోన్ చేశారు. తనను తాను నక్సలైట్ గా సూర్యారావుకు నగేశ్ పరిచయం చేసుకున్నాడు. రూ.25లక్షలు ఇవ్వాలని సూర్యారావును ఆయన డిమాండ్ చేశాడు. లేకుంటే షేక్ పేటలో కంపెనీ కడుతున్న భవనాలను కూల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఏజీఎం సూర్యారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement