- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృష్ణా ట్రిబ్యునల్‌పై తెలంగాణ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ ఉపసంహరణపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అభ్యంతరాల దాఖలుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అవకాశం కోరాయి. దీంతో అభ్యంతరాల దాఖలుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్ ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచనతో పిటిషన్ ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. దీంతో త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది.