ఆ వయస్సువారే ఎక్కువ.. జాగ్రత్త సుమా!

by sudharani |
ఆ వయస్సువారే ఎక్కువ.. జాగ్రత్త సుమా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ ఒక్కటి అన్నిటికీ కారణమని చెబుతున్నా అలా చేయడం మానుకోవడంలేదు. జాగ్రత్త సుమా.. అంటూ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా అస్సలు మారడంలేదు. ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారే తప్ప తగ్గించుకోవడంలేదు. దీంతో ఇలాగైతే కష్టమంటూ వాళ్లు మళ్లీ హెచ్చరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

చాలామంది రాత్రంతా నిద్రపోకుండా కొన్ని వస్తువులను వాడుతూ ఉంటారు. దాని మూలంగా వారికి ఎన్నో సమస్యలు ఎదురువుతుంటాయి. దీంతో ఆరోగ్యం మెల్లమెల్లగా అనారోగ్యంగా మారుతుంది. దీంతో ఆ వ్యక్తికి పలు దీర్ఘకాలిక రోగాలు సోకే అవకాశముంది.

మన దేశానికి చెందిన ఓ సంస్థ ఈ అంశంపై గత సంవత్సరం మార్చి నుంచి ఫిబ్రవరి 29, 2020 వరకు సర్వే నిర్వహించింది. అందులో వెల్లడైన పలు అంశాలను తాజాగా తెలియజేసింది. అవేమిటంటే.. దేశంలో 92 శాతం మంది జనాలు నిద్రపోయే ముందు సెల్‌ఫోన్లు వాడుతున్నారని, అందులో 25 నుంచి 34 మధ్య వయస్సు గల వారే ఎక్కువని, దీంతో వారి నిద్రలేమీకి అవి ప్రధాన కారణమవుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సర్వే పేర్కొన్నది. అయితే అందులో సగంమంది సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్‌లలో ఉంటున్నారని, అర్ధరాత్రి దాటినా కూడా అలానే చేస్తున్నారని తెలిపింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూ నిద్రపోవడం మానేస్తున్నారని, అది అలా వ్యాసనంగా మారడంతో ప్రజలు తమ జీవనశైలిలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపింది. ఈ ధోరణితో రోగనిరోధక శక్తి, మానసికస్థితిని ప్రభావం చేస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి రోగాలు వచ్చే అవకాశముందని కూడా సర్వే పేర్కొన్నది.

tags : Indians, cellphones, 92 per cent, sleep, digital devices, Sleep deprivation

Advertisement

Next Story

Most Viewed