గొంతుకు తాడు.. తాడుకు రాయి.. చెరువులో..

by Sumithra |   ( Updated:2020-07-26 04:44:18.0  )
గొంతుకు తాడు.. తాడుకు రాయి.. చెరువులో..
X

దిశ, నాగర్‌కర్నూల్: గొంతుకు తాడు కట్టి.. తాడుకు రాయి కట్టి.. ఓ గుర్తు తెలియని వ్యక్తిని చెరువులో పడేసి హత్య చేసిన ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ గాంధీ నాయక్ వివరాల ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తులు తాగి ఓ వ్యక్తిని(55) హత్య చేసి చెరువులో పడేశారు. శవం కూడా దొరకొద్దని గొంతుకు తాడు బిగించి తడుకు రాయిని కట్టి మరీ దారుణంగా హత్య చేశారు. చెరువులో శవం తేలియాడుతోందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మున్సిపల్ సిబ్బంది సహకారంతో బయటికి తీశారు. దాదాపు మూడ్రోజుల క్రితం సంఘటన జరిగి ఉండవచ్చనీ డీఎస్పీ మోహన్ రెడ్డి, సీఐ గాంధీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. అనంతరం వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసును చేధించి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story